ఏబీఎన్ లైవ్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని, అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. దీనిపై ఆగ్రహించిన బీజేపీ రాష్ట్ర కమిటీ.. పత్రిక విలువలను వదిలేసి ప్రవర్తించిన ఛానెల్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చూస్తుంటే.. అత్త మీద కోసం దుత్త మీద చూపించినట్లుంది. కొట్టిన వాళ్ల.. కొట్టించుకున్న వాళ్లు బాగానే ఉన్నారు. మధ్యలో ఛానెల్ మీద పడ్డారు. లైవ్ డిబేట్ నిర్వహించడం అన్ని ఛానెల్స్ చేస్తున్న పనే. కానీ, అక్కడ ఎలా మాట్లాడుతున్నాం అనేది నాయకులు కాస్త గమనించుకోవాలి.
Must Read ;- నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

ఇది నాయకుల నీతిమాలిన వ్యవహారాలకు పరాకాష్టనే చెప్పాలి. డిబేట్ జరుగుతున్న విషయాన్ని గాలికొదిలేసి ఏదేదో మాట్లాడుతూ.. మీలాగా భజన చేయాలా అంటూ అవతలి వాళ్లని రెచ్చగొట్టినట్టు విష్టువర్ధన్ రెడ్డి మాట్లాడడం అందరూ చూశారు. ఇది విని సహించలేని ఆ నాయకుడు తన సంయమనాన్ని కోల్పోయి ఇలాంటి ప్రవర్తనకు పాల్పడ్డాడు. కానీ, బీజేపీ తన కోసం మాత్రం ఛానెల్ పైన తీర్చుకుంటున్నట్లుంది.
Also Read ;- తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?











