ఆకాశ ప్రయాణంలో అలసిపోయిన రాజహంస నేలపై వాలిపోయిందా? అనిపించే రూపం బిపాషా బసు సొంతం. బాలీవుడ్ తెరపై భారీ అందాల ప్రదర్శనకు వెనుకాడని సాహసవంతమైన సౌందర్యానికి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ తెరపై రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయిన భామల్లో బిపాషా ముందువరుసలో నిలుస్తుంది. దాదాపు ఓ 15 ఏళ్లపాటు తెరపై ఆమె అందాల ఆధిపత్యం కొనసాగింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఇప్పటికీ తన సౌందర్యాన్ని కాపాడుకుంటూనే వస్తోంది.

బిపాషా బసు సరస్సులోకి దిగితే కలువలా కనిపిస్తుంది .. కొండవాలులో సేదదీరితే అందాల జలపాతంలా అనిపిస్తుంది. తన అందాలను చూస్తూ ఆకలిని మరిచిపోయే కుర్రాళ్లను ఆమె అలా నిర్లక్ష్యంగా వదిలేయలేదు. సోషల్ మీడియాలో తన హాటు ఫొటోలను పోస్ట్ చేస్తూ వాళ్ల ఆలనాపాలన చూస్తూనే ఉంది. వాళ్లు కూడా పెద్దగా బెంగపెట్టేసుకోకుండా ఆ ఫొటోలతో సర్దుకుంటున్నారు .. సరిపెట్టు కుంటున్నారు. ఆమె కోలకళ్లు చెప్పే కబుర్లను వింటూ తెల్లవారు జామున ఒక కునుకు తీస్తున్నారు. అందం ఒక చోటున .. ఆరాధన ఒక చోటున ఉంటే ఇలాగే ఉంటుంది మరి.
తాజాగా ఆమె తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి మాల్దీవుల్లో దిగిన ఒక ఫొటోను వదిలింది. అనంతమైన సముద్రానికి తన అందాలను జోడించి భర్త అక్కున సేదదీరుతోంది. ఆయన చెంతనుంటే ఈ లోకంతోనే తనకి పనిలేదన్నట్టుగా తనని తాను మరిచిపోయి తన్మయత్వానికి లోనవుతోంది. రీసెంట్ గా తన భర్త బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి మాల్దీవులకు వెళ్లినట్టుగా ఆమె రాసుకొచ్చింది. తన భర్త బర్త్ డే ఈ ఏడాది తన రెండవ ఫేవరేట్ డే అంటూ ఆయనపట్ల తనకి గల ప్రేమానురాగాలను చాటుకుంది. ఎక్కడైతే సముద్రం .. ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయో అదే నేను .. మా ఆయన అంటూ, తమ ప్రేమకు హద్దులు లేవనే అర్థం చెప్పింది. బిపాషా అందాలను చూస్తూ చల్లబడినట్టుగా సముద్రం ప్రశాంతంగా కనిపిస్తుంది కదూ.
Must Read ;- వెన్నెల వేడి పుట్టించడమంటే ఇదేనేమో!










