టీ్ఏవపీఎస్‌ఆర్టీసీ రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉందని ఆ సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు.లీటర్ డీజిల్ ధర రూపాయి పెరిగితే సంస్థపై రూ.2.4 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొంటూ ఇంధనం పొదుపుగా వాడాలని సిబ్బందికి సూచించారు. కాబట్టి ఖర్చులు తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.
15 ఏళ్ల తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్న ఎంపీ విజయసాయి
ఇదిలా ఉండగా సీఎం జగన్ కృషితో 15 ఏళ్ల తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఎంపీగారు నష్టాలొస్తున్నా లెక్కల్లో లాభాలు వస్తున్నట్లు బాగానే రాస్తారు.. మీ చర్యలు వలన ఆర్టీసీనే కాదు అన్నీ అప్పుల్లోనూ.. నష్టాల్లోనూ ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. జగన్‌రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్టుతో ఆర్టీసీ 6 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మరో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
Must Read ;- రూ.లక్ష కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు విజయసాయి కుట్ర: అయ్యన్నపాత్రుడు
ఎంపీ గారికి నష్టాలు వస్తున్న లాభాలు వస్తున్నట్లు లెక్కలు బానే రాస్తారు..!
ఒక్క ఆర్టీసీ నే కాదు మీ చర్యలు వల్ల అన్ని అప్పుల్లో మరియు నష్టాల్లో ఉన్నాయి.#గోరంట్ల#ApBleedingFromJTax pic.twitter.com/NbJJnpQbIo— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 23, 2021
.@VSReddy_MP ఎప్పటిలాగే @ysjagan దూరదృష్టి వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేసింది అంటూ తనకి అలవాటైన తప్పుడు లెక్కలు రాసారు.కానీ జగన్ రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఆర్టీసీ 6 వేల కోట్ల ఆప్పుల్లో కూరుకుపోయిందని.(1/2) pic.twitter.com/B5oxXkBywr
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 23, 2021











