రాజ్యాలు అంతరించినా, రాజరికాలు ముగిసిపోయినా చారిత్రక ప్రసిద్ధి గాంచిన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఆయుధపూజను తిలకించేందుకు అనేకమంది ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఏడాది కోవిడ్ నేపధ్యంలో రాజకుటుంబీకులే సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
కరోనా నేపధ్యంలో ..
విజయదశమి సందర్భంగా ప్రతి ఏటా అంగరంగవైభవంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో నిర్వహించే ఆయుధపూజను, కరోనా నేపధ్యంలో ఈ ఏడాది సంప్రదాయబద్ధంగా, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా రాజకుంటుంబీకులు నిర్వహించారు. బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్‌లో రాజవంశీకులు నిర్వహించిన ఆయుధపూజలో కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఆహూతులు పాల్గొన్నారు. (ఇదీ చదవండి : బొబ్బిలి రాజు గారి ప్రస్తుత పరిస్థితి ఏంటి?)
మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, రాంనాయన, బేబినాయన ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య వారి నివాసం నుంచి దర్బార్ మహల్‌కు వెళ్లారు. అక్కడవున్న రాజ(బంగారు) సింహాసనాన్ని, బొబ్బిలి రాజ వంశీయులు ధర్మారావు, వెంగళరావు, తాండ్ర పాపారాయుడు, గోపాలకృష్ణరంగారావు వారి తాత తండ్రులు బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలకు పూజలు చేశారు.
బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఖడ్గాలు, బల్లేలు, తుపాకులను ప్రదర్శనగా ఉంచారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం మేరకు ఆయుధ పూజ నిర్వహించామని ఈ సందర్భంగా మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, ఆయన సోదరుడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బేబినాయన తెలిపారు.
బొబ్బిలి కోటలో ఆయుధ పూజ ఫోటోలు చూడండి :














