మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలు కాకుండా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళుతున్న వరుణ్ తేజ్ ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో గని అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 12న ఉపేంద్ర ‘గని’ సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం. అయితే.. ఈ మూవీలో ఉపేంద్ర అతిధి పాత్ర పోషించనున్నారనేది అఫిషియల్ గా ప్రకటించాల్సివుంది. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ క్రేజీ మూవీ సిద్దూ ముద్దా మరియు అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. దబాంగ్ లేడీ సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ సినిమాలో స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ట్రైనింగ్ తీసుకున్నారు. బాక్సింగ్ నేపధ్యంతో రూపొందుతోన్న గని తెలుగు ఇండస్ట్రీలో రానున్న క్రేజీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి.. వరుణ్ తేజ్ కి ఈ స్పోర్ట్స్ ఫిల్మ్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;-గరుడవేగ దర్శకుడితో వరుణ్ తేజ్











