కన్నడ స్టార్ హీరోల్లో ‘ఉపేంద్ర‘ ఒకరు. ఒక వైపున కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలు వస్తే, ఇతర భాషల్లోను ఆయన నటిస్తుంటారు. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి క్రేజ్ ఉంది. ఇతర కథానాయకుల చిత్రాలతో పోలిస్తే ఉపేంద్ర సినిమాలు చాలా వైధ్యంగా ఉంటాయి. ఆయన పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలు కూడా కొంత విభిన్నంగానే ఉంటాయి. అందువలన ఒక వర్గం ప్రేక్షకులు ఆయన సినిమాలను ఎక్కువగా లైక్ చేస్తారు. అలాంటి ఉపేంద్ర హీరోగా ఒక భారీ చిత్రం రూపొందనుంది .. ఆ సినిమా పేరే ‘కబ్జా’.
దర్శకుడు ఆర్. చంద్రు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. మరాఠీ .. బెంగాలీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి, అంతగా ఈ సినిమాలో ఏవుందబ్బా అనే ఆశ్చర్యం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర మాత్రమే కాకుండా, మరో కన్నడ స్టార్ హీరో కూడా చేయనున్నాడట. ఆ హీరో ఎవరన్నది సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రకటిస్తారట. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు చేయనున్న మరో స్టార్ హీరో ఎవరబ్బా? అనే ఆత్రుత అందరిలోను పెరిగిపోతోంది. కన్నడలో ఉపేంద్రతో సమానమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోగా సుదీప్ కనిపిస్తాడు. బహుశా మరో హీరో ఆయన అయ్యుంటాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇక కథానాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలతో పాటు, మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. మొత్తానికి ఉపేంద్ర ఈ ఏడాది ఒక భారీ ప్రయోగమే చేయనున్నాడన్న మాట.
Must Read ;- హీరో ఎలివేషన్ కేక.. ప్రశాంత్ నీల్ తోపు