స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్. అందరూ బాబీ అంటారు. తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్ని పెద్ద స్టార్ మాత్రమే కాదు కుటంబ విలువలు తెలిసిన మనిషి అని అంటారు ఆయనతో సన్నిహితంగా ఉండే వారు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యుల ముఖ్యమైన ఫింక్షన్స్ కు మాత్రం తప్పకుండా హాజరవుతాడు. అలాగే వాళ్ళ పుట్టిన రోజు నాడు విష్ చేసి సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఇటీవల తన అన్నయ్య బాబీ పుట్టిన రోజు కావడంతో మంచి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడు బన్నీ.
ఉదయపూర్ లో జరిగిన మెగా డాటర్ నిహారిక వివాహ వేడుక సందర్భంగా తీయించుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. అందులో ముగ్గురు అన్నదమ్ములు స్టన్నింగ్ లుక్స్ తో అదిరిపోయే రేంజ్ లో ఉన్నారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బాబీ. రాబోయే సంవత్సరం నీకు మరుపురాని సంవత్సరంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ప్రతీ సందర్భానికి, సినిమాకు నువ్వు ముఖ్యమైన మూల స్తంభానివి. ఈరోజు నీకొక మంచి రోజుగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశాడు అర్జున్.
అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప‘ సినిమా షూటింగ్ లో తను వచ్చే ఏడాది జనవరి నెలలో జాయిన్ అవుతాడని సమాచారం. బన్నీ మాత్రమే కాకుండా మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా నుండి బాబీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులు కూడా అల్లు బాబీకి పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఇక అల్లు బాబీ నిర్మాణ సారథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రాబోతోంది.
Must Read ;- మెగా ఫ్యామిలీ నుంచి తెరపైకి మరో హీరో.. !