వైసీపీ ఎంపీ రఘురామరాజును కస్టోడియల్ టార్చర్ చేశారని,దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ తనయుడు భరత్ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి.సీబీఐ,కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.దీనిపై 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వాన్నికూడా ప్రతివాదులుగా చేర్చాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే కోరినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం,జగన్,సీఐడీలను తొలగించారు.తదుపరి విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.
Must Read ;- అనుకూల నివేదిక కోసం వైద్యులపై ఒత్తిడి.. తన వద్ద సాక్ష్యాలున్నాయన్న ఆర్కే











