రాజకీయ నాయకులు సాధారణంగా టంగ్ స్లిప్ అవుతుంటారు. ప్రసంగాల్లో తప్పులు దొర్లడం సహజమే. కానీ ఏపీ సీఎం జగన్ రెడ్డి మాత్రం టంగ్ స్లిప్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా పదే పదే తప్పులు మాట్లాడటం.. సామాన్యులకే కాదు.. సొంత పార్టీ నాయకులకు సైతం విసుగు తెప్పిస్తోంది. ‘బాబోయ్ ఇవేం తప్పులు’ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అనేకసార్లు తప్పులు మాట్లాడటం.. ట్రోల్స్ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
పదే పదే తడబాటు
మంగళవారం ఏపీలోని గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమానికి సీఎం జగన్ రెడ్డి హాజరై మాట్లాడారు. జగన్ తడబడుతూ మాట్లాడటం స్పష్టంగా కనిపించింది. దిశ యాప్ గురించి వివరిస్తూ… ‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాఅంటే… మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ ఓ మహిళ కాబట్టి’ అని మైక్ పట్టుకొని మరీ చెప్పారు. ఆ పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత తేరుకొని సీఎంను అలర్ట్ చేయడంతో… హోమ్ మినిస్టర్ అంటూ ఓ నవ్వు నవ్వారు. సీఎం జగన్ టంగ్ స్లిప్ అవ్వడం ఇది మొదటిసారి కాదు.. గతంలో ఎన్నోసార్లు తడబడుతూ ప్రసంగాలు ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా దిశ చట్టం గురించి మాట్లాడుతూ ‘టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడానికి ఆమె బైక్ దిగింది’ అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. పదే పదే నారా లోకేశ్ పదజాలంపై విమర్శలు చేసే వైసీపీ నాయకులు.. జగన్ ట్రోల్స్ పై ఎందుకు స్పందించడం లేదంటూ టీడీపీ నాయకులు చురకలంటిస్తున్నారు.
Must Read ;- జగన్ సర్కారు తీరుతోనే ఏపీలో కరోనా కల్లోలం : చంద్రబాబు











