ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు, కార్యకర్తలకు ఇచ్చిన వలంటీర్ పోస్టుల్ని ఉద్యోగాలుగా చూపిస్తూ ఫేక్ మాటల డూబురెడ్డి విడుదల చేసింది డాబు క్యాలెండర్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. శుక్రవారం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జాబు క్యాలెండర్ ప్రకటనలో అవాస్తవాలు, తప్పుడు సమాచారాన్ని ఆయన బట్టబయలు చేశారు. సీఎం అయ్యాక 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్ వందల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరి 1న జాబు క్యాలెండర్ విడుదల చేస్తానని, ఎన్నికల సభల్లో గొంతు చించుకున్న జగన్‌రెడ్డి..అధికారంలోకొచ్చి రెండేళ్లు దాటిపోయినా ఆ ఊసే ఎత్తకుండా రెండేళ్ల తరువాత ఇప్పుడు తప్పుడు లెక్కలతో జాబు క్యాలెండర్ విడుదల చేయడం మడమ తిప్పడంలో తనకు ఎవరూ సాటిలేరని జగన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు.
యాడ్స్‌లోనూ క్విడ్‌ప్రో లెక్కలే!
ఉద్యోగాలు ఏమీ ఇవ్వక పోయినా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తూ కోట్ల రూపాయలు మీడియాకి ప్రకటనలు ఇచ్చుకున్నారని, ఇందులోనూ అన్నీ క్విడ్‌ప్రోకో దొంగ లెక్కలేనా అని జగన్‌రెడ్డిని నారా లోకేష్ నిలదీశారు. 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు అని యాడ్ ఇచ్చి, అందులో వందల్లో సర్కారీ కొలువులు, మిగిలినవన్నీ వైసీపీ కార్యకర్తలకిచ్చిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నౌకరీలను కలిపేశారన్నారు. వలంటీర్లది ఉద్యోగం కాదు సేవ అని సెలవిచ్చిన సీఎం, మరి ఇప్పుడు జాబు క్యాలెండర్‌లో 2 లక్షల 59 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని ఎలా పేర్కొంటారని నిలదీశారు. అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సహానీ గ్రూప్-1&2 పోస్టులు 907, పోలీస్ శాఖలో 7740 ఖాళీలున్నాయని ప్రకటిస్తే, డూబురెడ్డి కేలండర్‌లో గ్రూప్-1&2 పోస్టులు 36, పోలీస్‌శాఖలో 450 పోస్టులున్నాయన్నారని, చీఫ్ సెక్రటరీ ప్రకటనకి చీఫ్ మినిస్టర్ ప్రకటనలకు మధ్య వేల ఉద్యోగాలు ఎవరు ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం ప్రకటించిన గ్రూప్-1&2 36 పోస్టులూ ఆల్రెడీ ఏ2, ఏ1 బాబాయ్, సలహాలరెడ్డి అమ్మేశారని తాడేపల్లి కాంపౌండ్ నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. ఆల్రెడీ ఆర్టీసీలో పనిచేస్తోన్న 54 వేల మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రకటించుకోవడం వైసీపీ కపట ప్రకటనలకు అద్దం పడుతోందన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం వాస్తవంగా 10 వేల జాబ్ నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. వార్డు/గ్రామ సచివాలయంలో 1లక్ష 20 వేల పైబడి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకున్న ప్రభుత్వం, దీని వల్ల 30 వేలమందికి పైగా మీసేవపై ఆధారపడి బతుకుతున్ననిరుద్యోగులను రోడ్డున పడేయలేదా అని ప్రశ్నించారు.
వేతనాల పెంపులో అన్నీ అవాస్తవాలే..
జగన్‌రెడ్డి ప్రకటించిన జీతాలు, వేతనాల పెంపులో అన్నీ అవాస్తవాలేనని నారా లోకేష్ మండిపడ్డారు. అంగన్వాడీల జీతం రూ.7,100 నుండి 10,500కి పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అయితే జగన్‌రెడ్డి దీనికి రూ. 500 కలిపి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. హోమ్ గార్డ్స్ జీతం రూ.9,000 నుండి 18,000కి పెంచింది టిడిపి హయాంలోనే అని పేర్కొన్నారు. వీఆర్ఏల జీతం రూ.6000 నుండి 10,500కి పెంచింది టీడీపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. RTC ఉద్యోగులకు, AP NGO ల కు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఘనత టీడీపీదేనన్నారు. పోలీసుల్ని వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వాడుకుంటూ ప్రతిపక్షంపై కక్షసాధింపులకు వారిని వినియోగిస్తున్న జగన్‌రెడ్డి వల్ల ఏ ఒక్క పోలీసు అయినా వీక్లీ ఆఫ్ తీసుకున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. నిజంగా ఉద్యోగులకు మేలు చేసినవాడైతే కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అధికారంలోకొచ్చిన ఏడు రోజుల్లోగా సీపీఎస్ రద్దు చేస్తానని ఫేక్ హామీనిచ్చి సీఎం గద్దెనెక్కిన జగన్‌రెడ్డి 700 రోజులు దాటినా దాని ఊసేలేకపోవడం దారుణమన్నారు. డిఏ, పిఆర్సీ గురించి కనీసం ప్రస్తావన లేకపోవడం ఉద్యోగుల పట్ల, వారి సంక్షేమం పట్ల వైసీపీ సర్కారు చూపిస్తున్నది సవతి తల్లి ప్రేమ అని తేటతెల్లమైందన్నారు. వైసీపీకి దొంగ ఓట్లేయించే వైసీపీ కార్యకర్తల్నివలంటీర్లుగా వేసుకోవడం వివక్ష లేకపోవడమా? వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా? ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా? అని జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నారా లోకేష్ నిలదీశారు.
Must Read ;- ప్రతీ దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు : నారా లోకేశ్
డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండర్ విడుదల చేసారు.2లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని @ysjagan హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని..(1/3) pic.twitter.com/IxLVgXQEZW
— Lokesh Nara (@naralokesh) June 18, 2021
వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా?ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 18, 2021