ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. షేక్ పేట భూవివాదం పై సి.కళ్యాణ్ తో పాటుగా ముగ్గురి పై కేసు నమోదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే… అమెరికాలో డాక్టర్ గా వర్క్ చేస్తున్న స్వరూప్ 1985లో షేక్ పేట ఫిలింనగర్ హౌసింగ్ సోసైటీ నుంచి భూమి కొనుగోలు చేశారు. ఆతర్వాత 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాడు. అయితే.. నిన్న సాయంత్రం నిర్మాత సి.కళ్యాణ్ పంపిస్తే వచ్చామని చెప్పి స్వరూప్, శ్రీకాంత్, తేజస్వి కలిసి ఆర్గానిక్ స్టోర్ కు తాళం వేశారని స్వరూప్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితో పాటు సి.కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే… సి.కళ్యాణ్ మాత్రం ఈ కేసు గురించి ఇంకా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సి.కళ్యాణ్.. నందమూరి బాలకృష్ణతో సినిమా నిర్మించాలని గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. వినాయక్ డైరెక్షన్ లో బాలయ్యతో సినిమా నిర్మించాలి అనుకున్నారు కానీ.. కథ సెట్ కాకపోవడం వలన కుదరలేదు. వినాయక్ ఇప్పుడు ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బాలయ్య హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ బారీ చిత్రం నిర్మించడానికి సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Must Read ;- షాకింగ్ ధరకు.. బాలయ్య ‘అఖండ’ హిందీ డబ్బింగ్ రైట్స్