దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మెగా అభిమానులు, నందమూరి అభిమానులే కాకుండా సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. 2021 దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే.. కరో్నా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈసారి కూడా చెప్పిన డేట్ కి రావడం లేదు. 2022లో సంక్రాంతికి కానీ.. సమ్మర్ కి కానీ విడుదల కానున్నట్టుగా వార్తలు వచ్చాయి.
దీంతో ఇక ఆర్ఆర్ఆర్ ఈ సంవత్సరంలో విడుదల కాదని ఫిక్స్ అయ్యారు. అయితే.. రాజమౌళి మాత్రం అక్టోబర్ 13నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చరణ్‌లు ఒకే బైక్ పై షికారు చేస్తున్న ఫొటో అది. కొమురం భీమ్ నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. వెనుక కూర్చున్న అల్లూరి సీతారామరాజు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటి వరకూ అల్లూరి, కొమరం పాత్రల మధ్యన వైరం చూపించిన రాజమౌళి, వాళ్లలోనే స్నేహాన్ని ఎలివేట్ చేసిన పోస్టర్ అది.
ఈ పోస్టర్ పై కూడా అక్టోబరు 13నే విడుదల అని ఉంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు జక్కన అక్టోబర్ 13నే ఆర్ఆర్ఆర్ ని విడుదల చేయాలని ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఆర్.ఆర్.ఆర్ టాకీ ఎప్పుడో పూర్తయిపోయిందని, రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సివుంది నిర్మాత ప్రకటించారు. రెండు పాటల్ని చిత్రీకరించడానికి ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చు. అందుచేత అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వడం ఖాయమని చెప్పచ్చు.
Must Read ;- ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్.. జక్కన్న ప్లాన్ అదే?