పూరి, ఛార్మిల కనెక్ట్స్ ఎక్కెడెక్కడికో వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా డగ్స్ కొనుగోళ్ల వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ప్రధాన ఆరోపణం. దీని కోసమే ఈడీ నిన్న పూరిని 11 గంటలపాటు విచారించింది. ఈరోజు ఛార్మిని విచారిస్తోంది. వీరికి డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో సంబంధాలు ఉన్నట్లు ఈడీ వద్ద ఆధారాలున్నాయి. ముఖ్యంగా పూరి, ఛార్మిలకు చెందిన పూరి కనెక్ట్స్ నుంచి కెల్విన్ అకౌంటుకు భారీగా నగడు బదిలీ అయినట్లు చెబుతున్నారు. ఈడీ మొట్టమొదటి విచారణ పూరి, ఛార్మిలతోనే మొదలైంది.
ఛార్మి ఎక్కడో పంజాబి అమ్మాయి.. పూరి ఇక్కడి అబ్బాయి. అక్కడి అమ్మాయికి ఇక్కడి అబ్బాయికి ఎక్కడ కనెక్ట్ అయ్యింది అన్నది ప్రధాన అంశాం. నిజానికి ఈ ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. 2001లో ‘నీతోడు కావాలి’ అంటూ జనానికి దగ్గరైంది ఛార్మి. అయినా 2015 వరకూ పూరితో కనెక్ట్ కాలేదు. ఎప్పుడైతే ఛార్మి కథానాయికగా ‘జ్యోతిలక్ష్మి’ సినిమా తీశారో అక్కడ వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఏర్పడింది. చివరికి అది పూరి కనెక్ట్స్ అనే సంస్థను ఏర్పాటుచేసే వరకూ వెళ్లింది. 2016లో ఈ సంస్థ ఏర్పడింది.
అందులో ఆమెకు కూడా భాగస్వమ్యం ఉందని జనం అంటుంటారు. ఈ పూరి కనెక్ట్స్ నుంచి కెల్విన్ అకౌంట్ కు డబ్బు ఎప్పటి నుంచి బదిలీ అవుతుందన్న సమాచారం ఈడీ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. పూరి వల్ల ఛార్మికి కెల్విన్ తో సంబంధాలు ఏర్పడ్డాయా? ఛార్మి కారణంగానే పూరికి కెల్విన్ తో కనెక్షన్ ఏర్పడిందా అన్నది మాత్రం తెలియదు. అసలు ఈ కనెక్షన్ లో ఎంతవరకు నిజముందన్నది కూడా తెలియదు.
నిప్పులేకుండా పొగరాదంటారు కాబట్టి ఉన్నట్టుగానే భావించాలి. నేటి తరంలో పూరికి దర్శకుడిగా మంచి పేరుంది. త్వరితగతిన సినిమాలు పూర్తిచేస్తారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. అది నిజం కూడా. సినిమాల విషయంలో ఛార్మి సలహాలు సంప్రదింపులు ఆయనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలియదు. వీరిద్దరి సినిమా రంగ ప్రవేశం ఇంచుమించు ఒకేసారి జరిగింది. ఇద్దరి సినిమా కెరీర్ మీద మాత్రం ఈ డ్రగ్స్ కేసు ఘటన మాత్రం మాయని మచ్చగానే మిగిలిపోనుంది.
Must Read ;- అప్పుడులేని రకుల్ పేరు ఇప్పుడెలా వచ్చింది?











