డ్రగ్స్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న 12 మందిలో 11 మంది విచారణ ఒక ఎత్తు, టాలీవుడ్ గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఒక ఎత్తులా కనిపిస్తోంది. ఎందుకో తెలియదుగానీ ఈ కేసులో రకుల్ ప్రీతి్ సింగ్ విచారణపైనే అందరి దృష్టీ ఉంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఎక్సియిజ్ సిట్ విచారించిన జాబితాలో రకుల్ పేరు లేదు. అప్పట్లో చాలామందిని విచారించినా ఎవరూ రకుల్ పేరు కూడా ఎత్తలేదు.
ఆ మధ్య బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆ కేసు డ్రగ్స్ వైపు మలుపు తిరిగింది. అప్పుడు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ విచారణ చేసినప్పుడు రకుల్ ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ పేరు తెగ వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఆమె వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న ‘కొండపొలం’ షూటింగ్ లో ఉంది. ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు. అలాంటిది అకస్మాత్తుగా ఆమె పేరు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నెల 6వ తేదీన ఆమె విచారణకు రావలసి ఉంది. తాను ఆరోజు విచారణకు రాలేనని, మరో రోజు హాజరుకాగలనని ఆమె ఈడీ అధికారులను కోరింది. ఆమె అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. ముందుగా చెప్పిన విధంగా 6వ తేదీ విచారణకు వచ్చి తీరాల్సిందేనని అన్నారు. అసలు కెల్విన్ కాంటాక్ట్స్ లిస్టులో ఆమె పేరు ఉందా? లేదా? అన్నది తెలియదు. ఈ కేసు ఏ విధంగా రకుల్ పీకకు చుట్టుకుంటుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Must Read ;- పూరి, ఛార్మిల ఈ డ్రగ్స్ కనెక్ట్స్ ఏమిటి?











