TPCC Chief Revanth Reddy’s Cutout Goes Viral On Social Media :
తెలంగాణలో విపక్షాలన్నీ సీఎం కేసీఆర్‌ను దొరగా సంబోధిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమంటే.. దొర గారి ఇలాక అన్నట్లే కదా. అలాంటి దొర ఇలాకా గజ్వేల్ లో నిన్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. సీఎం కేసీఆర్ ను దునుమాడుతూ సాగు కాంగ్రెస్ నేతల ప్రసంగాలను వినేందుకు గజ్వేల్ కు ఎవరు వస్తారులే అన్న వాదనలు వినిపించాయి. అయితే టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న ఉత్సాహం నేపథ్యంలో ఈ అంచనాలన్నీ పటాపంచలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు గజ్వేల్ సభకు ఓ లక్ష మంది వరకు హాజరవుతారని అనుకున్నా.. ఆ అంచనాకు రెట్టింపు సంఖ్యలో ఏకంగా 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యారట. దీంతో కాంగ్రెస్‌లో జోష్ నింపిన రేవంత్ లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది.
దొర పాలిట యముడేనట
గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా సభ పరిసరాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశాయి. అయితే వాటన్నింటిలోకి ఓ భారీ కటౌట్ మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కటౌట్ లో రవేంత్ ఒక్కరే కనిపిస్తున్నారు. అది కూడా యముడి గెటప్ లో. సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లు యముడి పాత్రలో ఎలా ఆకట్టుకున్నారో.. ఈ కటౌట్ లో రేవంత్ కు కూడా అదే అప్లాజ్ వచ్చిందని చెప్పాలి. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కటౌట్ లో రేవంత్ రూపం నిజంగానే యముడిని తలపించింది. ఇక ఆ కటౌట్ కింద.. దొర పాలిట యముడు అంటూ ఓ అదిరేటి క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. సభ మొత్తానికి ఈ కటౌట్ మరింత శోభను తెచ్చిందని కూడా చెప్పక తప్పదు.
రాహుల్ వచ్చి ఉంటేనా..?
ఈ సభకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, భావి ప్రధానిగా పార్టీ నేతలంతా భావించే రాహుల్ గాంధీ వస్తారనే అంతా అనుకున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ ను ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానానికి రాహుల్ సానుకూలంగా స్పందిస్తారన్న వార్తలూ వినిపించాయి. అయితే అదే రోజున నిర్మల్ బీజేపీ నిర్వహించనున్న సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్సో, లేదంటే. ఇంకే కారణమో గానీ గజ్వేల్ సభకు రాహుల్ హాజరు కాలేదు. రాహుల్ రాకున్నా.. గజ్వేల్ సభను రేవంత్ గ్రాండ్ సక్సెస్ గా ముగించారు. అదే రాహుల్ వచ్చి ఉంటే గనుక.. ఈ సభ మరింత గ్రాండ్ గా ముగిసేది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. యముడి గెటప్ లో రేవంత్ ఉన్న మాదిరి మరిన్ని కటౌట్లు గజ్వేల్ ను ముంచెత్తేవే.
Must Read ;- బీజేపీ, కాంగ్రెస్.. హిట్ కొట్టిందెవరు?











