వైద్యులంటే అంత నిర్లక్ష్యం తగదు .. మూల్యం చెల్లించక తప్పదు!
జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య చర్యలు, అలసత్వపు ఛాయలు చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు చేటుకాలం తెచ్చిపెట్టింది. గుంటూరు సర్వజనాసుపత్రిలో వైద్య విద్యార్థులపై సీఎం బంధువులమంటూ .. దాడికి దిగారు. దీనిని వైద్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసులకు జూడాలు ఫిర్యాదు చేసిన స్పందన లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జూడాలు నిరసన బాటపట్టారు. గడిచిన మూడు రోజులుగా జూడాలు గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట నిరసనలు దిగి, విధులను బహిష్కరిస్తే .. జిల్లాలో ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కనీసం కలగచేసికుని సమస్యను పరిష్కరించలేకపోయారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖాంటూ ఒకటుంది .. దానికి మంత్రి ఒకరున్నారన్న సంగతిని కూడా ప్రజలు ఎప్పుడో మరిచారు. ఒక వేళ గుర్తొచ్చిన ఆ మంత్రి మహానుభావుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి. మేం సీఎం బంధువులం .. ఏ పీకుతారో పీక్కొండి అని గుంటూరు ప్రభుత్వాసుపత్రి జూనియర్ డాక్టర్లపై దాడి చేస్తే ..కనీసం వారికి ఓదార్పునిచ్చే చర్యలు కూడా చేపట్టకపోవడంపై వైద్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను ప్రస్తుతం రేకెత్తిస్తున్నాయి. మూడు రోజులు నుంచి నిరసనలు చేస్తుంటే పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరూ పోలేదు. చివరికి అది అక్కడితో ఆగకుండా గుంటూరు నుంచి ఏపీ మొత్తానికి పాకింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రి లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లు .. గుంటూరు వైద్యులపై జరిగిన దాడిని ఖండించి, చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించి సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ లకు సమ్మె నోటీసును అందజేశారు. దీంతో నేడు లక్షలాది మంది రోగుల ఆరోగ్య పరిస్థితి, ప్రాణాలు గాల్లో దీపమైంది.
24 గంటల్లో దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి …
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులపై సీఎం బంధువులమంటూ దాడికి పాల్పడిన ఆ దుండగులను 24 గంటల్లో అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే అత్యవరస సేవలను కూడా నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూడాలు హెచ్చరించారు. శుక్రవారం నుంచి ఓపి సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే జగన్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల డిమాండ్స్ పట్టవు. ఉద్యోగుల సమస్యలు అసలే పట్టవు. చివరికి ఉద్యోగుల భద్రత కూడా అలా వదిలేసి, బాధ్యత రాహిత్యం గా వ్యవహిస్తే ఎలా అని వైద్యాశాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- మర్రి రాజశేఖర్ కు మండింది ..! జగన్ రెడ్డిని తిట్టిపోశారుగా!!










