ప్రేక్షక పాత్రలో సూపరింటెండెంట్.. అసహనం వ్యక్తం చేస్తున్న జూడాలు!
అధికారపార్టీ అడుగుల మడుగులొత్తడం గుంటూరు సూపరింటెండెంట్ చైర్ లో కూర్చున్న ఏ ఒక్క వైద్యాధికారికైనా పరిపాటే. జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది.. రక్షణ కల్పించండిం అంటే ప్రేక్షక పాత్రలో సూపరింటెండెంట్ ప్రభావతి మౌనం వత్రం చేపట్టింది. దీంతో ఆగ్రహించిన జూడాలు విధులను బహిష్కరించి, జీజీహెచ్ ఎదుట బైఠాయించారు. వైద్యాధికారులే తమ రక్షణ కల్పించే చర్యలు చేపట్టకపోవడం శోచనీయని వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులు పాటు జూడాలు చేస్తున్న ఆందోళనల మూలంగా జీజీహెచ్ లో వైద్య సేవలు స్తంబించాయి. సీఎం బంధులకే మీ మర్యాదులివ్వరా? మమ్మల్నే పేషెంట్ వార్డు నుంచి బయటకు వెళ్లమంటారా అంటూ .. నోటికొచ్చినట్లు దుర్భాషలాడి, దాడికి పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన జూడాలు సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేస్తే .. స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వైద్యులు విధులు బహిష్కరించారు. ఇలా జూడాలు విధులు బహిష్కరించడంతో.. జీజీహెచ్ లో అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సేవలు స్తంబించాయి. రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జూడాలతోపాటు .. రోగుల బంధువులు ఆందోళనలు..!
జూనియర్ డాక్టర్లపై అధికారపార్టీ నాయకుల దౌర్జన్యాన్ని జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న రోగులు, రోగి బంధువులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రోజులు పాటు వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలు కారణంగా వార్డుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వైద్యసేవలు అందక రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి క్రిటికల్ కేర్, జనరల్ సర్జరీ విభాగంలో సేవలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో పేదవాడి వైద్యం గాల్లో దీపమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, జూనియర్ డాక్టర్ల పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- నెల్లూరులో పోలీసు జులం..! అధికారపార్టీ ఎమ్మెల్యేకు సైతం తప్పని ఆంక్షాలు!!











