ఎక్కు పెడదాం విమర్శానస్త్రాలు .. ఇక ఉపేక్షించేదు లేదు!
జగన్ రెడ్డిపై ప్రభుత్వంపై సొంత పార్టీవారే విమర్శానస్త్రాలు ఎక్కువపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లు పాటు చూసి చూసి సహనం నశించింది. ఉపేక్షించేదు లేదు .. తాడోపేడో తెల్చుకుందాం అని పార్టీ అధినేతపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. నాయకులదే కాదు .. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారపార్టీ మంత్రులది, ప్రజాప్రతినిధుల ఇదే పరిస్థితి! స్వేచ్ఛ లేదు, స్వతంత్ర నిర్ణయాలకు చోటు లేదు. సొంత ఆలోచనలు వీలు పడదు… ఇది అదికారపార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు పరిస్థితి. సొంత నియోజకవర్గాల్లో వారికి తెలియకుండానే పనులు సాగిపోతుంటాయి. ఎమ్మెల్యేలతో పనిలేకుండా పార్టీ పెద్దలమంటూ వచ్చి నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తుంటారని ఎప్పటినుంచో అధికారపార్టీ నేతల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి. మొన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగంగానే తనలో అసతృప్తిని వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలకు దిగారు. తాజా శుక్రవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మర్రి రాజశేఖర బావమరిది వెంకటసుబ్బయ్య సీఎం జగన్ రెడ్డి పై ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈ సమయంలో మర్రి రాజశేఖర్ పక్కనే ఉండటం గమనార్హం!
రోశయ్యను బ్రతికున్నప్పుడు బాధించారు..! చనిపోయినా వదలరా?
రోశయ్యను బ్రతికున్నప్పుడు సాక్షి మీడియాను అడ్డపెట్టుకునే లేనిపోని కథనాలతో ఆయన బాధించారు. తీరా చనిపోయినా తరువాత కూడా వదలరా? అంటూ మర్రి రాజశేఖర్ స్వయానా బావమరిది వెంకటసుబ్బయ్య విమర్శించారు. స్థానిక స్వచ్ఛంధ సంస్థ సోమేపల్లి సాంబయ్య పౌండేషన్ ఏర్పాటు చేసిన రోశయ్య సంస్మరణ సభకు మర్రి రాజశేఖర్ తోపాటు ఆయన బంధువు వెంకట సుబ్బయ్య కూడా హాజరయ్యారు. ఇదే వేదికగా సీఎం జగన్ తీరును విమర్శించారు. పార్టీ తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, గుండెల్లో పెట్టకుంటామని చెప్పి గుండెలపై తన్నారంటూ అసంతృప్తిని వెల్లగక్కాడు. రోశయ్య పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా ముఖ్యమంత్రికి తీరిక దొరకలేదని, సీఎం పదవీ నుంచి దించే వరకు జగన్ సామాజీకవర్గం నిద్రపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి రాజశేఖర్ బావమరిది చేసిన కామెంట్స్ పార్టీలో, నేతల్లో పెద్ద దుమారమే రేపుతోంది. రెండునరేళ్లుగా మర్రికి ఎమ్మెల్సీ పదవీ ఇస్తాం ఇస్తాం అని చెప్పి జిల్లాలో లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి, మురుగుడు హనుమంతరావు కు ఎమ్మెల్సీ పదవులిచ్చి కట్టపెట్టి.. మర్రికి మొండి చెయ్యి చూపించారు జగన్ రెడ్డి.
Must Read ;- రోశయ్య పై జగన్ కక్ష సాధింపు ..! సంతాపం తెలపకపోవడానకి కారణాలివేనా?!











