అవంతికి తాకిన సెగ ..!
జగన్ రెడ్డి ప్రభుత్వం హయంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశనిస్పృహలతో ఉన్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను నెరవేర్చకుండా, పెండింగ్ జీతాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. ఇటువంటి నిర్లక్ష్య ధ్రోరణిని సహించేది లేదని ఉద్యోగులు ఉద్యమ బాటపడుతున్నారు. విశాఖలోని సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావును ఇంటి ముట్టడించారు. మంత్రి ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో భారీగా పోలీసుల మోహరించి, ఉద్యోగులను అడ్డుకున్నారు. కేజీహెచ్ లో పనిచేస్తున్న 65 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని.. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. తక్షణమే తమను ఉద్యోగాల్లోకి తీసుకుని, భద్రత కల్పిచాలని డిమాండ్ చేశారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఇంటికి వారి వినతి పత్రాన్ని అంటించి వెనుదిరిగారు. ఈ మధ్య విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని విజయవాడలోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించి, నిరసన వ్యక్తం చేసిన సంగతి విధితమే!.
Must Read ;- విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు ..! ముగిసిపోయే ‘అథ్యయం’?











