ఉసురుమనించిన పీఆర్సీ రిపోర్ట్..! 27శాతం ఫిట్మెంట్ తో ప్రతిపాదనలు!
11వ పీఆర్సీ, 7 డీఏలు, సీపీఎస్ రద్దు, ఒప్పందు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల రూ.1600 కోట్ల ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బులు ప్రభుత్వం వాడకం.. ఇలా 71 రకాల సమస్యలతో కూడిన డిమాండ్స్ ను ప్రభుత్వముందుంచితే.. నేడు రిపోర్ట్ తో ఒక డ్రామాకు తెరతీసి ఉసురుమనిపించారు. పీఆర్సీ నివేదిక కమిటీ సభ్యులు శశిభూషన్ కుమార్, రావత్ లు తయారు చేసిన పీఆర్సీ రిపోర్ట్ ను సీఎస్ సమీర్ శర్మ సీఎం జగన్ రెడ్డికి అందజేశారు. అనంతరం పీఆర్సీ రిపోర్ట్ ను ప్రభుత్వం ఫైనాన్స్ వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. ఉద్యోగు సంఘాలకు కూడా రిపోర్టును అందజేస్తామని మీడియాతో సీఎస్ సమీర్ పేర్కొన్నారు. సీఎం దీనిపై 72 గంటల్లో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు.
సెంట్రల్ పే స్కేల్ తో లింక్ చేస్తే ఎలా??
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీర్సీని సెంట్రల్ పే స్కేల్ తో సరిపోల్చడం సబబు కాదని సచివాలయం ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ప్రసాద్ వాపోయ్యారు. కేవలం 5 సంవత్సరాలకొకసారి స్టేట్ పే స్కేల్ తో మాత్రమే పీఆర్సీని ప్రకటిస్తారని చెప్పారు. సెంట్రల్ పే స్కేల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యగులకు 10 ఏళ్లు కొకసారి పీఆర్సీని, ఇతర సమస్యలను ప్రకటిస్తారని వివరించారు. కార్యదర్శులిచ్చిన రిపోర్ట్ ను ఉద్యోగ సంఘాలతో చర్చించి, పూర్తి అధ్యాయనం చేసిన తరవాతే తదుపరి కార్యచరణ ఉంటుందని ఆయన చెప్పారు. 2019 లో ఆశోక్ మిశ్రా కమిటీకి పీఆర్సీ ప్రతిపాదనలు ఇచ్చామని, పీఆర్సీ కమిటీ సిఫార్సుల మేరకు నేడు గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఇచ్చిన సిఫార్సులను బేరీజ్ చేసుకుని తదుపరి ఉద్యోగుల నిర్ణయం తెలుపుతామన్నారు. అలానే సీఎం 72 గంటల తరువాత ప్రకటించే నిర్ణయంపై భవిష్యత్ కార్యచరణ ఆధారపడి ఉండబోతుందన్నారు. ఇదిలా ఉంటే సీఎస్.. ఉద్యోగులకు ఇస్తున్న పీఆర్సీతో ప్రభుత్వానికి 11 వేల కోట్లు భారం పడుతుందని వివరించారు. 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. 2018 నుంచి పీఆర్సీ అమలవుతున్నట్లు సీఎస్ చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం రిపోర్ట్ చదివిన తరువాతే తమ అభిప్రాయాలను చెబుతామని చెప్పారు.
Must Read ;- ఉద్యోగ జేఏసీల్లో తోడేళ్లు .. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు!