టీటీడీకి లేఖ రాసిన స్పందన లేదు ..!
మంగళవారం చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి రైతుల మహాపాదయాత్ర ఆటోనగర్ మీదిగా రామానాయుడు కళ్యాణ మండపం వరకు పాదయాత్ర ముగిసింది. రేపు అలిపిరి నుంచి తిరుమల ప్రయాణం కానున్నారు రైతులు. నేడు సాగిన పాదయాత్రకు స్థానికులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఎంపీ గల్లా జయదేవ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపి, రైతులతోపాటు పాదయాత్రలో నడిచారు. రేపు స్వామి వారిని సామూహికంగా దర్శంచుకోనున్నారు రైతులు. దీనిపై టీటీడీకి జేఏసీ లేఖ రాసింది. సామూహికంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని కోరింది. అయితే దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు. 500 ల కిలోమీటర్ల దూరాన్ని స్వామి వారిపై భారం వేసి అమరావతిలోని తుళ్లూరు నుంచి పాదయాత్రగా నడిచివస్తున్న రైతులకు స్వామి దర్శన భాగ్యం కల్పించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరుపతిలోని ఓ ప్రైవేటు ప్రాంగణంలో బహిరంగ సభను ఈ నెల 17 నిర్వహించనున్నట్లు రైతు జేఏసీ ప్రకటించగా .. తిరుపతి అర్బన్ పోలీసులు అనుమతులను నిరాకరించారు. దీనిపై రైతు సంఘాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.
Must Read ;- తిరుపతిలో 17న సభ నిర్వహించి తీరుతాం..!











