విశాల ప్రయోజనాలు కావువి .. విధ్వంసకర ఆలోచనలు!
జగన్ రెడ్డి ఏపీలో పాలన పగ్గాలు చేపట్టినాటినుంచి ఆర్థిక విధ్వంసకర ఆలోచనలే తప్పా .. ఏ ఒక్క చిన్నపాటి అభివృద్థిని కూడా ప్రజలు చూడలేదు. రాష్ట్రంలో ఆదాయం వనరులు కుప్పకూలిపోయాయి. సహజ వనరులు నిలువున దోపిడికి గురైయ్యాయి. విశాల ప్రయోజనాలు ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి. మరో 30 ఏళ్లు కోలుకోలేని దెబ్బతో ఏపీ సర్వతోముఖం సర్వనాశనమైంది. దేశంలో రాజధానిలేని రాష్ట్రం ఏది అని గూగుల్లో వెతికేతి అది ఆంధ్రప్రదేశ్ అని వస్తోంది. అటువంటి దౌర్భగ్య పరిస్థితి ఏపీకి పట్టిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగానే పట్టిందని ఏపీ ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఆపార్టీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి మూడు రాజధానులపై కుండబద్ధలు కొట్టారు. సమగ్రంగా ప్రతిపాధించిన బిల్లును మార్చి – 2022 లో మరోసారి సభలో ప్రవేశపెడతామని చెప్పారు. మంత్రి చేసిన కామెంట్ వెనుక పార్టీ స్టాండ్, కుటీల రాజకీయం లేక పోలేదు.
సెంటిమెంట్స్ తో పనిలేదు .. కేవలం స్వార్థరాజకీయాలే ప్రమాణీకం!
రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చిన రైతుల సెంటిమెంట్స్ తో పనిలేదు .. ఒకటే రాజధాని కావాలని .. అది అమరావతిలోనే ఉండాలని భూములిచ్చిన రైతులు 717 రోజుల పాటు చేస్తున్న రైతులు ఉద్యమం, రైతు పాదయాత్ర, రైతుల మనోభావాలతో పనిలేదు. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం జగన్మోహన్ కి స్వార్ధరాజకీయాలే ప్రమాణీకంగా కనిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. వార్ వన్ సైడ్ మాదిరిగా ప్రతిపక్ష, వామపక్ష, ప్రజాసంఘాలు, రాష్ట్రంలోని ఏక రాజధాని కావాలని బలంగా కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ఆంకాంక్షలతో జగన్ రెడ్డి కి ఎటువంటి పనిలేదు. కేవలం రాష్ట్రంలోని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం,వాటిని స్వప్రయోజనాలకు వాడుకోవడం పనిగా పెట్టుకుందని అధికారపార్టీపై ఆరోపణలు లేకపోలేదు. దేశ వ్యాప్తంగా జగన్ పాలన సాగిస్తున్న తీరును చూసి ఏపీ వైపు పొరుగు రాష్ట్రాలు జాలీగా చూస్తున్నాయన్న ఇంగితం కూడా లేదు. 30, 25,20 ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పకుంటూ అన్ని ఏళ్లు పాటు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఉంటారని ఆపార్టీ నాయకులు జోష్యం చెబుతున్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్ర భవిష్యత్తును అథ:పాతాలనికి తొక్కిన జగన్ రెడ్డిని ఈ రెండుళ్లు భరించడం చాలా ఎక్కవ అని విశ్లేషకులు వాపోతున్నారు.
Must Read ;- మద్యం సీసాలో పురుగులు.. అత్యంత ప్రమాదకరం ఏపీ మద్యం..!











