ప్రభుత్వం చర్యలతో రైతులకు వరిగిందేమి లేదు..!
జగన్ రెడ్డికి తీరిక దొరికినప్పుడల్లా ఐ అండ్ పీఆర్ మైకు ముందు ఇచ్చే ఉపాన్యాసంలో ఊత పదాలు ఇవే.. మాది రైతు పక్షపాత ప్రభుత్వం, మాది రైతుల కుటుంబం అని డబ్బాకొడుతుంటారు. కానీ రెండుళ్లుగా రాష్ట్రంలో పంటలు ఏ స్థాయిలో తెగుళ్లు వచ్చి సర్వనాశనం అయ్యాయే ఆయన తెలియదు! ఆ శాఖ మంత్రి విపక్షాలపై విరుచుకుపడటం తప్పా.. పల్నాడు ప్రాంతంలో కొన్ని లక్షల హెక్టార్లులో జెమిని వైరస్ కారణంగా నష్టపోయిన మిర్చి, పత్తి పంటల గురించి పట్టదు! ఉత్తరాంధ్ర లో కూడా వరి రైతు ఎదుర్కొంటున్న సమస్యలపై సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి, ప్రస్తుత శ్రీకాకుళం ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలను, లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి సాగుతో లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన రైతు కష్టం తీరడం లేదని వాపోయ్యారు.
సంక్షేమంతో ఆకలి కేకలు వినిపించడంలేదు..!
శ్రీకాకుళంలో మత్స్యకారులను ఆదుకోకుంటే వలసలు ఇంకా పెరుగుతాయని ధర్మాన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు వైపు మరలాలని, రోయ్యల సాగు చేస్తే లాభాలుంటాయని సూచించారు. కష్టమైన సంక్షేమం కొనసాగిస్తున్నామని, సంక్షేమం వల్ల ఆకలి కేకలు వినిపిచడం లేదని ఒకింత సీఎం జగన్ రెడ్డి తీరును ప్రశ్నించారు. అభివృద్ధి మాట పక్కనపెడితే వచ్చే రెండెళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మరోసారి రాష్ట్రంలో పడకేసిన అభివృద్ధిని విమర్శిస్తూ… అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేక మార్లు ప్రభుత్వం తీరుపై ధర్మాన ప్రశ్నించారు. తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజా చేసిన ఈ కామెంట్స్ రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మొన్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం పెదవి విరిచాడు. రాష్ట్రంలో మాఫియా కోరలు చాచుతోందని ప్రత్యక్ష విమర్శలకు దిగారు.
Must Read ;- సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!











