మార్పు సెంటిమెంట్ రాష్ట్రాన్ని చుట్టింది..!
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఫ్యాన్ కు ఎదురుగాలి వీస్తోంది..! అధికారపార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అంతర్మదనం మొదలైంది. గోడు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే కనిపించడు! పోనీ కలుద్దామని ఇంటికి పోతే కలవకుండా మొహం చాటేస్తాడు!! ఇది ఒక్క ఉత్తరాంధ్ర పరిస్ధితే కాదు.. ఏపీలోని అన్ని జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్తకర్తల పరిస్థితి ఇంతే. నియోజకవర్గాల్లో అభివృద్ధి పడకేసి.. అవినీతి విలయతాండవం చేస్తోంది. గ్రామ సర్పంచ్ కన్నా.. వలంటీర్ పెత్తనం ఎక్కవైంది! పార్టీ కార్యకర్తలకు ఫలానా పని కావాలని నాయకులు అడుగుతుంటే.. పట్టించుకొని అధికారులే సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఎందుకంటే ఉద్యోగ సమస్యలను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది కాబట్టి! మరి ఇటువంటి పరిస్థితిలో పార్టీల కొనసాగడం కన్నా.. పార్టీ మారితే బాగుండు అనే నిర్ణయానికే అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. అధికార పార్టీలో శరవేగంగా మారుతున్న పరిణామాలను, జగన్ పాలన తీరుతెన్నెలను గ్రహించిన ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ ఇప్పటి నుంచే దారులు వెతుకుంటున్నారు. శ్రీకాకుళంలో మొన్న ఈ మధ్య ఐదు వందల కుటుంబాలు అధికారపార్టీని వీడి, టీడీపీలోకి వచ్చి చేరారు. అలానే మంత్రి సీదిరి అప్పలరాజు సొంత నియోజవర్గమైన పలాస నుంచి కూడా వలంటీర్స్ సైతం ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చి చేరారు.
విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిరసన సెగలు..!
విశాఖ జిల్లా పాయకరావుపేటలో అధికారపార్టీలో నిరసన సెగలు పెల్లుబుకుతున్నాయి. ఎమ్మెల్యే గొల్ల బాబురావు పై స్థానిక నేతలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బంగారమ్మపాలెంలో ఎంపీపీ శారదాకుమారి వర్గానికి చెందిన సర్పంచులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే తనకు విలువ ఇవ్వడంలేదని సర్చంచ్లు, ఎంపీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కులం, డబ్బుకు ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఇక పై ఎమ్మెల్యే ముఖం కూడా చూడమని ఎంపీపీ వర్గం తీర్మానించుకున్నారు. సర్పంచ్ లకు చెక్ పవర్ ను రద్దు చేయాలని చూసే ఎమ్మెల్యే మనకు అవసరం లేదని తెగేసి చెప్పారు. మరోవైపు నిన్న కడప జిల్లాలో ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఎదుటనే అధికారపార్టీ నేతలు బాహాబాహీకి దిగిన సంగతి విదితమే!
Must Read ;- వివేకానంద హత్యకేసులో అధికార పార్టీ V/S సీబీఐ..! మిస్టరీ వీడుతోందా?











