వైసీపీలో మిగిలింది .. ధిక్కారామేనా?
జగన్ రెడ్డి పాలనలో గడిచిన రెండునరేళ్లల్లో ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మిగిలింది అసంతృప్తే.. కాదుకాదు తీవ్ర అంసంతృప్తేనని చెప్పాలి! ఎందుకంటే జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు ఎంతదెగ్గరగా చూశారు. ఆయన చర్యలకు విసిగి వేజారి.. పాలన విరగడ ఎప్పుడౌతుందా.. అని ఎదురు చూస్తున్నారు! ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఒక అడుగు ముందుకేసి రోడ్డెక్కి మరి జగన్ రెడ్డి చర్యలపై, ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఆ మొన్న చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే రోజా పై పుత్తూరు మండల నాయకులు తిట్టిపోశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని సొంతపార్టీ నాయకులే రోడ్డుకీడ్చిన పరిస్థితి! దీంతో కనీసం బయటకొచ్చి, ఆరోపిస్తున్న అవినీతిని డిఫెన్స్ చేయలేని పరిస్థితి రోజాది. మరో వైపు ఉత్తరాంధ్రలోని పాయకారావు పేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై ఆ పార్టీ ముఖ్యనాయకులే రోడ్డెక్కి జగన్ ముద్దు… బాబురావు వద్దు ఫ్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీలో రెండు, మూడు వర్గాలుగా చీలి కొట్టుకుంటున్నారు.
తాలిబాన్ రాజ్యంగా తంబళ్లపల్లె..!
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తాలిబాన్ రాజ్యం నడుస్తోందని వైసీపీ నేత, ఆ పార్టీ జడ్పీటీసీ భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి అధికారపార్టీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిపై ధ్వజమెత్తారు. కేవలం జగన్ రెడ్డిని చూసే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించామని కొండ్రెడ్డి విమర్శించారు. పుంగనూరు నుంచి వచ్చి.. తమపై, తమ నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి వేధింపులు, అవమానాలే చివరికి మిగులుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసి తమ గోడు విన్నవించుకుందామని చూసిన, కలవనీయకుండా చేస్తున్నారని కొండ్రెడ్డి వాపోతున్నారు. ఎమ్మెల్యే చర్యలను ఇక ఉపేక్షించేది లేదని నియోజకవర్గంలోని ముఖ్యనేతలందురూ ఒకతాటిపైకి వచ్చినట్లు సమాచారం!
Must Read ;- సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!











