కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది..!
జగన్ రెడ్డి ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఒంటిరిని చెయ్యాలని భీష్మించుకున్నాడు. రాజధాని విషయాన్ని లెవనెత్తి ఏదో సాధించాలని చూశాడు. టీడీపీకి మిత్ర పక్షంలా ఉన్న బీజేపీ తనవైపు లాక్కుని అడుగులు మడుగులొత్తాడు. చివరి లాగికొడితే.. ఇప్పడు నాలుక కర్చుకున్నాడు. జగన్ రెడ్డి చర్యలను కల్లారా చూసిన రైతులు ఉద్యమిస్తే.. ఏపీ మొత్తం ముక్తకంఠంతో ఏపీ ప్రభుత్వాన్ని, మూడు రాజధానుల అంశాన్ని ఖండించింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దార్శినికతతో నిర్ణయించిన అమరావతే మా ఏపీ రాజధాని అని అన్ని పార్టీలు, ప్రజలు నేడు ఒప్పకుంటున్నారు. జగన్ రెడ్డి కుటీల రాజకీయ నీతిని ఎండగడుతున్నారు. రాజకీయ పక్షాలన్ని ఒక్కతాటిపైకి వచ్చి.. జగన్ రెడ్డిని గద్దెదించితేనే ఏపీ బాగుపడుతోందని ఒక నిర్ణయానికి వచ్చారు. మరో వైపు సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో టికెట్ ధర నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినీ పరిశ్రమ కోవిడ్ కారణంగా రోడ్డున పడింది. కోలుకుంటున్న తరుణంలో ఇలా థియేట్లర్లలో టికెట్ ధరలపై నియంత్రణ విధించడం సరికాదని సినీ ప్రముఖులు మొత్తుకుంటున్నా.. జగ మొండి నాయకుడికి అర్థకావడంలేదు. బుధవారం సినిమా థియేటర్లలో టికెట్ ధర తగ్గింపు వ్యవహారంపై సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్ చేశారు. కోవిడ్ వైరస్ కు, జగన్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని విమర్శించారు. ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతోంది అన్నారు. థియేటర్లపై, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మంత్రుల కామెంట్స్.. స్టుపిడ్ ఆర్గ్యుమెంట్స్..!
హీరోల రెమ్యూనరేషన్ గురించి ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్స్ అవివేకుల చేసే వింత చర్చని రాంగోపాల్ వర్మ విమర్శించారు. హీరో బ్రాండ్ పై ఆధారపడే సినిమా ఉంటుంది, అతనని బేస్ చేసుకునే థియేటర్లకు ప్రేక్షకుడు వస్తాడని ఆయన చెప్పారు. అటువంటి హీరోల ఇమేజ్ ను తగ్గించుకోమని చెప్పడం హాస్యస్పదమని చెప్పుకొచ్చారు. ఓ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వర్మ .. ఏపి ప్రభుత్వంపై తనదైన విమర్శలను ఎక్కుపెట్టారు. టికెట్ ధరలు తగ్గించడం కారణంగా హీరోలకు, అగ్రహీరోలకు వచ్చే నష్టం ఏమిలేదని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని చేసిన హీరోల పారితోషకం తగ్గడం అసాధ్యమని, ముమ్మటికీ ఏపీ ప్రభుత్వం చేస్తున్నదని తప్పని, ఇప్పటికైన థియేటర్ల యాజమాన్యలను ఆదుకోవాలని హితవు పలికాడు.
Must Read ;- గుళ్లులాంటి సినిమాహాల్స్ మూసివేస్తుంటే గుండె పగులుతోంది..!











