రెక్కాడితే డొక్కాడని కుటుంబం. పొలాన్నే నమ్ముకొని బతికే బడుగు జీవులు. అలాంటి కుటుంబంలో ‘టీ’ విషాదం నిపింది. పొద్దునే లేచి చాయ్ తాగి, పనికివెళ్దామనకున్నవాళ్లకు టీ రూపంలో ప్రమాదం కొనితెచ్చుకున్నట్లయింది. టీ తాగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన జనగామ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బచ్చన్న పేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళ ఉదయం టీ చేస్తుంది. అయితే ఆమె ఎంట్రిన్ గుళికలను టీ పొడిగా భావించి టీలో కలిపింది. చాయ్ తాగిన కొద్దిసేపటికే అంజమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు చాయ్ తాగిన భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే గుళికలను టీలో కలిపారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
Must Red ;- స్వతంత్ర భారత చరిత్రలో.. మొట్టమొదటిసారిగా మహిళా దోషికి ఉరి..!










