భారతదేశంలో దోషులకు ఉరిశిక్ష వేయడం కొత్తేమీ కాదు.. కానీ నేటి వరకు మహిళలకు ఉరిశిక్షలు వేసిన దాఖలాలు లేవు. చాలా దారుణమైన నేరమైతే తప్ప అలాంటి నిర్ణయం మహిళా నేరస్తుల విషయంలో తీసుకోవాల్సిన పరిస్థితి భారత్‌కు రాలేదు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా దోషికి ఉరిశిక్ష అములుకాబోతోంది. మరి ఉరిశిక్ష వేసేంత నేరం ఆమె ఏం చేసింది? ఉరిశిక్ష అములు నుంచి మినహాయింపు పొందడానికి ఎన్నో మార్గాలున్న మన దేశంలో.. అవన్నీ కూడా తన విషయంలో అక్కరకు రాకుండా పోయేంత ఘోరమైన నేరం ఏం చేసింది?
డబుల్ ఎమ్మె..
ఇంతటి నేరానికి పాల్పడిందంటే చాలామంది ఆమె చదువుకోని వ్యక్తేమో అనుకునేరు? కానే కాదు.. డబుల్ ఎమ్మే చదివిన ఉన్నత విద్యావంతురాలు షబ్నమ్. ఇక కుటుంబ నేపథ్యం ఏమైనా సమస్యా అనుకుంటున్నారా? ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులకు ముద్దుల చెల్లెలు షబ్నమ్. ఇలా చక్కనైనా కుటుంబం. మరి తను చేసిన నేరం ఏంటని అనుకుంటున్నారా? ప్రేమలో పడింది. అదీ ఏడవ తరగతితో చదువు ఆపేసిన సలీమ్ అనే వ్యక్తితో.. ఇద్దరి కులం ఒక్కటే అయినా.. వర్గాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు.
Also Read ;- కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!
కుటుంబ సభ్యులనే..
అప్పటి వరకు తనను చదివించి, పెంచి పెద్ద చేసిన కుటుంబ సభ్యులు శత్రువులయ్యారు. తన పెళ్లికి అడ్డు వస్తున్న వారిని అంతమొందించాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె ఆలోచనకు.. ప్రియుడు సహకారం తోడవడంతో.. తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు, వదిన, ఆమె చెల్లెలు, 10 నెలల మేనలుణ్ణి హతమార్చింది. అందుకోసం 2008 ఏప్రిల్ 14వ తేదీన అందరికీ పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత ఏ మాత్రం కాస్త కూడా కనికరమన్నదే లేకుండా వారందరి గొంతు కోసి హతమార్చింది షబ్నమ్.
మరణమే సరి..
అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో షబ్నమ్, సలీమ్ లకు యూపీ అమ్రోహా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై ఆమె అలాహాబాద్ కోర్టు, సుప్రీం కోర్టు.. చివరకు రాష్ట్రపతిని కూడా ఆశ్రయించింది. కానీ, అన్ని చోట్ల కింది కోర్టు శిక్షనే సమర్థించారు. రాష్ట్రపతి కూడా ఆమె విన్నపాన్ని తిరస్కరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయానికి 7 వారాల గర్భవతి. జైలులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బాబు కూడా తన తల్లిని క్షమించి వదిలిపెట్టాలంటూ రాష్ట్రపతికి విన్నవించుకున్నాడు. అన్ని దారులు మూసుకుపోవడంతో.. ఉరిశిక్ష తేదీ ఖరారు చేసిన వెంటనే ఆమెకు శిక్షను అములు చేసే అవకాశాలు ఉన్నాయి.
Must Read ;- చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?