పంజాబీ సంగీత పరిశ్రమ నేడు ఒక ప్రతిభావంతుడైన గాయకుడ్ని కోల్పోయింది. ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జాన్ (31) నేడు అమృతసర్ కు సమీపంలోని జండియాలా గురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్ సర్ నుంచి కర్తార్ పూర్ వెళ్తుండగా.. ఆగిఉన్న ఓ ట్రక్ ను బలంగా ఢీకొట్టగా.. దిల్జాన్ కారు నుజ్జు నుజ్జయింది. తీవ్రంగా గాయపడిన దిల్జాన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే దిల్జాన్ చనిపోయినట్టు ధ్రువీకరించారు డాక్టర్లు.
ప్రమాదానికి కారణాలేంటో పూర్తిగా తెలియకపోయినా.. అతివేగమే ప్రమాదానికి కారణమని యాక్సిడెంట్ ను కళ్ళారా చూసిన వారు చెబుతున్నారు. దిల్జాన్ కు భార్య, ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వారు కెనాడాలో ఉంటున్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆమె కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. దిల్జాన్ మృతికి పంజాబీ సంగీత ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు. సోషల్ మీడియాలో పలువురు ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
Must Read ;- దర్శకుడు రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణ మోహన్ రావు కన్నుమూత
Punjabi singer #Diljaan passed away in Punjab today. #Rip pic.twitter.com/xmnOK9sKVo
— SimplyBhangra.com (@Simply_Bhangra) March 30, 2021