(విశాఖపట్నం నుంచి వీడియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు ఆంథ్రుల హక్కు నినాదంతో నిర్వాసితుల కలక్టరేట్ ముట్టడి విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమానికి గత రెండు మూడు రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. కాలేజీ విద్యార్థుల సంతకాల సేకరణతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు బ్యాడ్జిలు పంపిణీ చేశారు. విశాఖ ఉక్కు పై చూపిస్తున్న వివక్ష పై విద్యార్థులు పాల్గొని, బ్యాడ్జి పెట్టుకుని నిరసన తెలియజేశారు. సరస్వతీ పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకూ శాంతియుత పాదయాత్రను విజయవంతం చేశారు.
విశాఖ ఉక్కుకు ఇళ్ళు… భూములను ఇచ్చేసిన నిర్వాసితులం ఉద్యోగాలు వస్తాయని కలగన్నామని, దశాబ్దాలు గడిచినా కలలుగానే మిగిలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు నీడన ప్రశాంతంగా గడపాలనుకున్న తమలో అనేకమంది ఏళ్ళు గడుస్తున్నా ఉపాధి మొఖం చూడకుండానే ఎందరో నిర్వాసితుల బతుకులు రాలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆలపించిన గీతాలు అందరినీ ఆలోచింపజేశాయి.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే లాభాలు, లేదంటే మూతే… కేంద్రానికి ‘ఉక్క’పోత