టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందుతోన్న బంగార్రాజు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. నాగార్జున బంగార్రాజు సినిమా కంటే ముందుగా ఘోస్ట్ అనే సినిమాని స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. అయితే.. కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది.
ఇక అప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక కోసం మేకర్స్ అన్వేషణ ఆరంభించారు. అమలాపాల్ ను కాంటాక్ట్ చేశారు. దాదాపుగా అమలాపాల్ కన్ ఫర్మ్ అనుకున్నారు. అయితే.. లాస్ట్ మినిట్ లో నో చెప్పిందని సమాచారం. కారణం ఏంటంటే.. సీనియర్ హీరోల సరసన నటిస్తే.. యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు మిస్ అవుతాయని ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. అమలా పాల్ తర్వాత మెహ్రీన్ పేరు వినిపించింది.
మెహ్రీన్ కూడా దాదాపుగా కన్ ఫర్మ్ అనుకున్నారు. ఈమె కూడా సీనియర్ హీరోల సరసన నటిస్తే యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు రావు అనుకుందో ఏమో కానీ.. నో చెప్పింది. ఆతర్వాత సోనాల్ చౌహాన్ ని కాంటాక్ట్ చేశారని.. ఆమె ఓకే చెప్పిందని సమాచారం. సోనాల్ చౌహాన్ బాలయ్యతో లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఎఫ్ 3 మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నాగ్ సరసన ఘోస్ట్ లో నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. మరి.. ఇక నుంచైనా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి.