‘మౌనమేలనోయి, నినుచూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీ జతగా నేనుండాలి, వీడెవడు’ .. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన హీరో సచిన్ జోషి. హిందీలోనూ పలు చిత్రాలలో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఈ నటుడ్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చ్ లో హైదరాబాద్ పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణలో సచిన్ జోషి గుట్కా తరలింపులో పాల్గొనడం వెలుగులోకి వచ్చింది.
దాంతో అతడిపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ పీనల్ కోడ్ సెక్షన్ 41 కింద కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.దుబాయ్ నుంచి ముంబై వెళుతుండగా.. సచిన్ జోషిని పోలీసులు అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం హైద్రాబాద్ కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం 80 గుట్కా పేకెట్స్ లో లక్షలు ఖరీదు చేసే సరకుందని తెలుస్తోంది.











