దేవాలయాల ఘటనపై మొట్టమొదటిసారిగా ఓ నటుడు గళం విప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ఘటనలు వరసగా జరుగుతున్నా ఇంతవరకూ ఏ ఒక్క నటుడుగానీ, సినీ ప్రముఖుడు గానీ నోరు విప్పలేదు. సినీ నటుడు సుమన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి వత్తాసుగా ఆయన మాట్లాడినట్టు అనిపించింది. ఈరోజు తిరుమలలో జరిగిన లగడపాటి రాజగోపాల్ కుమార్తె పెళ్లికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తచ్చేందుకు ప్రతిపక్షాలు చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ఎవరో ఒకర్ని దీనికి బాధ్యులుగా చేయలేమని, ఇతరులు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటానికి అవకాశం ఉందన్నారు. దేవుడి విషయంలో ఇలా చేస్తున్న వారెవరైనా తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?