మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న యంగ్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరుగా కనిపిస్తాడు. ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ కొట్టిన శ్రీనివాస్, తన తాజా చిత్రంగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆయన సరసన నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ప్రకాశ్ రాజ్ .. సోనూ సూద్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడాడు.
‘అల్లుడు అదుర్స్’ సినిమాకి టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ టైటిల్ ను సెట్ చేశాడు. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎక్కడా బోర్ అనిపించదు. నాన్ స్టాప్ గా అంతా నవ్వుతూనే ఉంటారు. అన్ని అంశాలు బాగా కుదిరిన కథ ఇది .. అందులో సందేహం లేదు. గతంలో నేను చేసిన ‘అల్లుడు శీను’మాదిరిగా .. సంతోష్ శ్రీనివాస్ చేసిన ‘కందిరీగ’ మాదిరిగా ఈ సినిమా సరదాగా .. సందడిగా సాగుతుంది.
“ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటూ, కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. నా యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అనూ ఇమ్మాన్యుయేల్ కి చాలా వెరైటీ పాత్ర పడింది. ఇంతవరకూ ఈ తరహా పాత్రలో ఎవరూ ఆమెను చూసి ఉండరు. ప్రకాశ్ రాజ్ గారి పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎక్కువగా నవ్విస్తుంది. సోనూ సూద్ పాత్రను మలిచిన తీరుకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందని గ్యారంటీగా చెప్పగలను” అని అన్నారు.
Also Read: బెల్లంకొండను చూసి వాతలు పెట్టుకుంటున్న హీరో