తెలుగు ప్రేక్షకుల అందాల హాట్ యాంకర్ టాలీవుడ్ రంగమ్మత్త అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా చిత్రాలకు కమిట్ మెంట్ తీసుకుంది. దాదాపు అన్నిట్లోనూ అమ్మడు ప్రధాన పాత్రలే పోషిస్తోంది. అలాగే.. తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో సైతం ఎంట్రీ ఇస్తూ.. పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొనే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం రంగమ్మత్త ఇటలీలో చిల్ అవుతూ.. తన అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. రవితేజ ఖిలాడీలో కీలక పాత్ర పోషిస్తోన్న అనసూయ.. ఇటలీలో దిగిన ఒక ఫోటోని తన ఇన్ స్టా ఖాతాలో రివీల్ చేసింది.
నిన్నగాక మొన్న మాస్ మహారాజా రవితేజ ఓ ఇటలీ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా ఫోటో తో రివీలయి.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఖిలాడీలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కిక్ 2 తర్వాత మాస్ మహారాజా తండ్రి కొడుకులుగా మరోసారి నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పొలిటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఖిలాడీ మూవీ లోని తన పాత్రతో అనసూయ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Must Read ;- మాలీవుడ్ లోకి అనసూయ ఎంట్రీ











