రీసెంట్ గా విడుదలై… వసూళ్ళ సునామీ క్రియేట్ చేస్తున్న కామెడీ మూవీ ‘జాతిరత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వారితో పాటు అందంగా అల్లరి చేసిన ముద్దు గుమ్మ ఫరియా అబ్దుల్లా. చిట్టి గా, చిలిపి లాయర్ గా చక్కగా పెర్ఫార్మ్ చేసిన ఈ కొంగ కాళ్ళ సుందరి .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో అమ్మడు ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ అందుకుందని సమాచారం.
ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక మూవీలో నటించబోతున్నాడు. ఇందులో రవితేజ సరసన కథానాయికగా చాలా మంది పేర్లు వినిపించాయి కానీ.. ఇంతవరకూ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు దర్శకుడు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఫరియా అబ్దుల్లాను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. అందానికి అందం, అభినయానికి అభినయం.. ఫరియా స్పెషాలిటీ. జాతిరత్నాలు తర్వాత ఆమె సైన్ చేయబోయే సినిమా ఇదేనట. మరి రవితేజ సినిమాకి ఫరియా ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- ‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ