నయనతార తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. దక్షిణాదిన అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న నాయికగా ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, అక్కడి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడతాయి. నయనతార తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమె డేట్ల కోసం పోటీపడే దర్శక నిర్మాతలు ఉన్నారేగానీ, ఆమె దర్శక నిర్మాతలను వెతుక్కునే పరిస్థితి ఇంతవరకూ రాలేదు. అదీ ఆమెకి గల క్రేజ్ .. మతిపోగొట్టే మార్కెట్.
అలాంటి నయనతార ప్రేమలో పడితే అది చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటుంది? ప్రేమకి ప్రతినిధిగా మారిపోతే ఆ విషయాన్ని గురించి మాట్లాడకుండా అభిమానులు ఎలా ఉండగలరు? నయనతారను ప్రేమించేవరకూ విఘ్నేశ్ శివన్ ఎవరో తెలుగువారికి పెద్దగా తెలియదు. ఆయన ఎవరికి మాత్రం ఎందుకు తెలియాలి? అన్నట్టుగా అతనితో కలిసి నయనతార హాయిగా చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తమ ప్రేమను గురించి అడిగినవారిని తిడుతూనే ఉంటుంది. అలా అని చెప్పేసి సైలెంట్ అవుతున్నారా అంటే అదీ లేదు .. తమ రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తూనే ఉంటారు.
చందమామ – వెన్నెల ఎంతసేపు చూసినా కొత్తగానే కనిపిస్తాయి. జలపాతాన్ని ఎంతసేవు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. తమ ఫోటోలను చూసి కూడా అలాంటి ఫీలింగును పొందవలసిందే అన్నట్టుగా ఈ ప్రేమజంట కొత్త కొత్త ఫొటోలను వదులుతుంటుంది. ప్రేమను .. ప్రేమికులను ఎవరూ విడదీయలేరనే విషయాన్ని చెప్పకనే చెబుతుంటుంది. తాజాగా రొమాంటిక్ మూడ్ లో ఈ ఇద్దరూ ఉన్న ఫొటో కూడా ఇదే సత్యాన్ని చెబుతోంది. ఇక లవర్స్ డే లోగా ఈ జంట ఇంకెన్ని చిత్రాలు చేస్తుందో .. మరెన్ని చిత్రాలు వదులుతుందో చూడాలి.
Must Read ;- నయన్ విఘ్నేష్ పెళ్లి ఎప్పుడో తెలుసా?











