బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆయన ప్రభ వెలిగిపోతున్నతరుణంలో ఆదిపురుష్ సినిమా చేయడానికి అంగీకరించాడు. దర్శకుడు ఓంరౌత్ ఏం చెప్సి ఒప్పించాడో గానీ సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకూ అన్నీ కష్టాలే. టెక్నికల్ గా మనం ఎంత ఎదిగినా పురుణ కథలను ఈ తరంలో సక్సెస్ చేయాలంటే చాలా కష్టం.
దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ విధానంలో ఈ సినిమాని తెరకెక్కించాడు. నిర్మాతలు చెబుతున్న బడ్జెట్ దాదాపు 500 కోట్లు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్ లో అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటి్ల్లింది. టీజర్ విడుదల చేసినప్పుడు అందరూ పెదవి విరిచారు. గత జనవరిలో విడుదల తేదీ ప్రకటించి వెనక్కి తగ్గారు. ట్రైలర్ విడుదల తర్వాత అందరికీ ఈ సినిమా మీద నమ్మకం కలిగింది. ఫలితంగా రూ. 240 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రమోషన్ వర్క్ బాగా జరిగింది. సినిమా మీద నమ్మకం కలిగి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలి రోజు 100 కోట్ల వసూళ్లు సాధించినట్టు లెక్కలు చెబుతున్నాయి. కేవలం ఇది ప్రమోషన్ వల్లే సాధ్యమైంది. పైగా సరైన సినిమా ఏదీ లేకపోవడం ఓ ప్లస్ పాయింట్. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆదిపురుష్ చేరిపోయింది. ఇప్పటిదాకా భారీ రికార్డు రాజమౌళి ట్రిపుల్ ఆర్ కే ఉంది.
ట్రిపుల్ ఆర్ రికార్డ్
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల వసూళ్లు సాధించింది. అంతకుముందు ఆ రికార్డు రాజమౌళి – ప్రభాస్ ల బాహుబలి- ది కంక్లూజన్ కు ఉంది. అది 217 కోట్ల వసూళ్లు సాధించింది. ఇటీవలే విడుదలైన షారుఖ్ ఖాన్ పఠాన్ కూడా రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మరి వీటితో పోలిస్తే ఆదిపురుష్ స్థానమెంత అన్న ఆసక్తి సహజం. తొలిరోజు 85 కోట్లు నెట్ వసూళ్లను ఆదిపురుష్ సాధించినట్టు చెబుతున్నారు. అంటే షారుక్ పఠాన్ కు దగ్గరగానే ఈ వసూళ్లు ఉన్నాయి. కానీ పఠాన్ వెయ్యికోట్ల వసూళ్లను సాధించింది. అంతకుముందు అమీర్ ఖాన్ దంగల్ గానీ, ప్రభాస్ బాహుబలిగానీ దాదాపు 1600 నుంచి 2000 కోట్ల వసూళ్లను సాధించాయి. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ కూడా భారీ వసూళ్లు సాధించింది. కానీ ఆదిపురుష్ ప్రభాస్ రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాలను పక్కన పెడితే మన భారతీయ సినిమాల్లో కొత్త రికార్డుకు తెరతీసిన సినిమాల జాబితాలో ఆదిపురుష్ కూడా చేరిపోయింది. అయితే దీని టోటల్ వసూళ్ల మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
తొలిరోజు టాక్ పాజిటివ్ గా లేదు. రామాయణంలో ఏప్స్ వేటలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇది పురాణ కథలా లేదు. మార్వెల్ సినిమాల్లా, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లా ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఆదిపురుష్ కు రూ. 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ స్థాయిలో వసూళ్లు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. సినిమా నిర్మాణ వ్యయం రూ. 500 కోట్లు అని చెబుతున్నారు. 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సినిమా విడుదల కావడానికి రెండేళ్లు పైగా పట్టింది. పైగా ప్రభాస్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో నిరాశ పర్చింది. ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ కూడా సరిగా ఆడలేదు. ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఆదిపురుష్ పైనే ఉన్నాయి.
దీని తర్వాత సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. ఆదిపురుష్ సక్సెస్ అయితే ఆ ప్రభావం వేరు. కానీ ఆది పురుష్ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. దర్శకుడు ఓంరౌత్ ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకోవడమే ప్రధాన తప్పిదం. ఎన్నో పురాణ కథలకు పుట్టినిల్లు మన దక్షిణాది. ఇలాంటి కథలను ఎంచుకుంటే పాత సినిమాలతో పోలిక తప్పనిసరి. తొలిరోజు వసూళ్లకు డోకా లేకపోయినా రేపటి నుంచి ఏమటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ సినిమాని ఇక్కడిదాకా లాక్కొచ్చింది ప్రమోషనే. రేపట్నుంచి కూడా భారీ వసూళ్లు సాధించాలంటే మౌత్ టాక్ కూడా అవసరం. మరి ఏం జరుగుతుందో చూడాలి.