‘ఆర్ .ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. లవ్, లస్ట్ అండ్ డిసీట్ కాన్సెప్ట్ తో యూత్ ను భలేగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఈ పాటికి వరుసగా సినిమాలు చేయాల్సిన ఈ దర్శకుడు.. ఇప్పటికీ రెండో సినిమాను తెరకెక్కించపోవడం ఆశ్చర్యం. అయితే రెండో సినిమా కోసం మంచి కథ రాసుకున్నప్పటికీ.. దాని నటీనటుల ఎంపిక ప్రక్రియ కు చాలా టైమ్ పట్టింది. ఎట్టకేలకు ఇందులో శర్వానంద్ హీరోగా ఖాయం అయ్యాడు . అలాగే అతడితో తమిళ హీరో సిద్ధార్థ కూడా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అనే టైటిల్ ను కూడా ఖాయం చేసిన సంగతి తెలిసిందే. ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ గాళ్ అదితీరావు హైదరీ నటించనుండడం ఆసక్తికిని కలిగిస్తోంది. చాలా మంది హీరోయిన్స్ ను అనుకున్నప్పటికీ .. ఫైనల్ గా అదితీ అయితే బెటర్ అనే అభిప్రాయినికి వచ్చారట మేకర్స్ . తను ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషం గా ఉందని అదితీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతున్న ‘మహాసముద్రం’ సినిమాకి అదితీ ప్రెజెన్స్ ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.
Looking forward 🌊
Thank you for the warm welcome 🙏🏻
A new story, a new journey and brand new butterflies in my tummy! #MahaSamudram https://t.co/bzI9QAxrr7— Aditi Rao Hydari (@aditiraohydari) October 12, 2020