ఎంపీ రఘురామరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు విడుదలలో మరింత ఆలస్యం కానుంది. ‘‘కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశా. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారు, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుంది’’ అని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. డిశ్చార్చి సమ్మరీ, షురిటీస్ లాంటివన్నీ పూర్తికావాలంటే ఇంకా మూడు, నాలుగు రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- రఘురామరాజుకు బెయిల్ ఇప్పించింది జగన్ లాయరే..!