ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు పి.సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకి కరోనా సోకగా హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాసవిడిచారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేసిన సోమశేఖర్ .. రంగీలా, సత్య, కంపెనీ, జంగిల్, దౌడ్ లాంటి వర్మ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు.
తన జీవితంలోని కీలకవ్యక్తుల్లో తన సోదరుడు సోమశేఖర్ ఒకరని వర్మ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన మృతితో విషాదంలో మునిగిపోయారు. సోమశేఖర్ మృతికి బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Must Read ;- వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ , ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూత











