ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద తదితర చిత్రాల్లో నటించిన బెంగుళూరు బ్యూటీ ప్రణీత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో ప్రణీత కెరీర్ ఊపందుకుంటుంది అనుకున్నారు కానీ.. ఆతర్వాత ప్రణీత కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఆశించిన స్ధాయిలో అవకాశాలు అందుకోలేదు. ఈ బెంగుళూరు బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తుంది.
ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోందని తెలిసింది. ప్రణీతను సపోర్ట్ చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. తెలుగు, తమిళ్ హీరోయిన్స్ తోనే అజయ్ దేవగన్ ఎక్కువుగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను అజయ్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కు అజయ్ ఏకంగా మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రణీతకు కూడా అవకాశం ఇచ్చాడు. టాలీవుడ్ లో ఆశించిన స్ధాయిలో అవకాశాలు అందుకోలేకపోయిన ప్రణీతకు బాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకుంది.
అజయ్ దేవగన్ నటిస్తున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో ప్రణీత అజయ్ సరసన నటిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, కన్నడలో ఈ భామకు అవకాశాలు బాగా తగ్గాయి. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ మూవీలో నటిస్తుండడం విశేషం. మరి.. సౌత్ లో ఆశించిన స్ధాయిలో ఆఫర్స్ దక్కించుకోలేకపోయిన ప్రణీత నార్త్ లో ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి