అక్కినేని అఖిల్ తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం.. దసరాకి వచ్చిన ఏజెంట్ విజయం సాధించడం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతకు భారీగా లాభాలను అందించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సక్సెస్ సాధించడంతో అఖిల్ నెక్ట్స్ మూవీ ఏజెంట్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ వేడుకలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో అఖిల్ సక్సెస్ కొట్టాడు. ఏజెంట్ సినిమాతో అఖిల్ స్టార్ అవ్వడం ఖాయం’ అని చెప్పాడు. సురేందర్ రెడ్డి అలా చెప్పడంతో ఏజెంట్ పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఏజెంట్ పొగ్రెస్ విషయానికి వస్తే.. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ స్పై థ్రిల్లర్ కి సూపర్ హిట్ హాలీవుడ్ బోర్న్ సిరీస్ ఆధారం అని సమాచారం. ఇందులోని అఖిల్ మేకోవర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరోపియన్ కంట్రీ అయిన బుడాపెస్ట్ లో జరుగుతోంది. అఖిల్ పై కళ్ళుచెదిరే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారు. అక్కడ ఫారెన్ క్రూ సహాయంతో షూట్ జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో లో ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Must Read ;- చైతు, అఖిల్ హిట్ కొట్టారు.. ఇక నాగ్ వంతే











