అక్కినేని నాగచైతన్య, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం లవ్ స్టోరీ. టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే.. ఈ సినిమాలోని సారంగదరియా లిరికల్ సాంగ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు ప్రేక్షకులు. అలాంటి ఈ సినిమా నిజానికి ఏప్రిల్ 16న విడుదల కావల్సి ఉంది. అయితే కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు మీడియా ముఖంగా తెలియచేశారు మేకర్స్. వీలైనంత త్వరగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
లాక్ డౌన్ కు ముందు సినిమా ప్రారంభమైనా.. థియేటర్స్ లోనే సినిమా విడుదలవ్వాలని ఏడాది కాలంగా వేచిచూశాం. ఎట్టకేలకు ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమయ్యాం. అయితే రెండు మూడు రోజుల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతుండడం గమనిస్తున్నాం. ఏప్రిల్ 16కి అవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. అందుకే ఒక వేళ సినిమా విడుదలయినా.. కోవిడ్ కారణంగా అందరూ సినిమాకి రాకపోవచ్చు. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి.. లవ్ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు.
Must Read ;- ‘సారంగ దరియా’ పాట వివాదానికి చరమ గీతం
In the wake of rising COVID cases, Makers of #LoveStory @SVCLLP postponed the release of the film. New release date to be announced soon.https://t.co/4xap9WcpWn@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 @iamMangli #AmigosCreations @adityamusic @niharikagajula pic.twitter.com/jtXkI9h2uP
— BARaju (@baraju_SuperHit) April 8, 2021