సౌత్ లో సాయిపల్లవి లాంటి బ్రిలియంట్ హీరోయినే లేదని చెప్పొచ్చు. ఆకర్షణీయమైన అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె సొంతం. అయినప్పటికీ ఆమె తనలోని టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకూ ఆమెకి గ్లామర్ తో దర్శకుల్ని ఆకట్టుకొనే పరిస్థితి ఏర్పడలేదంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కేవలం తన సహజనటనతోనే సౌత్ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఒక వేళ పొరపాటున ఆమె గ్లామరస్ గా కనిపించినా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరేమో అనేంతగా.. ఆమె తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తోంది.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగు చిత్రాలు రెండు విడుదల తేదీల్ని లాక్ చేసుకున్నాయి. అందులో ఒకటి రానా హీరోగా నటిస్తోన్న విరాట పర్వం అయితే.. మరొకటి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ. రెండూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. కానీ ఈ రెండింట్లోనూ కామన్ పాయింట్ మాత్రం లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాల్లోనూ రెండు వేరు వేరు పాత్రల్ని పోషించి.. జనాన్ని మెప్పించేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం సాయిపల్లవి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అందులో ఉగాది కానుకగా ఒక టీవీ ఛానల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్భంగా ఆమె ధరించిన బ్లూ ఆర్గంజ శారీ .. చూపరుల్ని భలేగా ఆకట్టుకుంటోంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో ఉన్న ఆ శారీ ఫోటోస్ లో నీలి ఆకాశంలా కనిపిస్తోంది సాయిపల్లవి. ప్రస్తుతం ఈ ఫోటోస్ కు అభిమానుల నుంచి సాయిపల్లవికి బోలెడన్ని కాంప్లిమెంట్స్ వచ్చి పడుతున్నాయి. అచ్చ తెలుగు మహిళా రత్నంలా మెరుస్తోన్న సాయిపల్లవి.. సౌత్ ఇండస్ట్రీకి మరో సౌందర్య అనే ప్రశంసలు అందుకుంటోంది.
Must Read ;- రౌడీ బేబీ చెల్లెలు కూడా వచ్చేస్తోంది… !