వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు విమర్శంచారు. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమేనని, అంతకుమించి ఏం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుంటే, షర్మిల సభకు ఎలా అనుమతి ఇచ్చారని అని డీజీపీని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు ఇవ్వని పర్మిషన్, షర్మిలకు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓట్లు చీల్చడానికే తప్ప, ఏమిలేదని, షర్మిల ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని విమర్శించారు.
Must Read ;- నేడు షర్మిల సంకల్ప సభ : అభిమానుల భారీ ర్యాలీ