తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రకటనలో భాగంగా ఇవాళ వైఎస్ షర్మిల ఖమ్మంకు వెళ్తారనే విషయం అందరికీ తెలిసిందే. సంకల్ప సభ కోసం అభిమానులు భారీ ఎత్తున అభిమానులు ర్యాలీ నిర్వహించారు. సభ కోసం ఉదయమే షర్మిల లోటస్ పాండ్ నుంచి బయలుదేరింది. అయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న షర్మిల కాన్వాయ్ ప్రమాదం జరిగినట్లు పోలీసుల సమాచారం. కాన్వాయ్ లోని నాలుగు వెహికల్స్, వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కార్లు మాత్రమే డ్యామేజ్ అయినట్లు, ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలేదని పోలీసులు చెప్తున్నారు.
Must Read ;- విజయమ్మే ముఖ్య అతిథి : తల్లి సమక్షంలోనే షర్మిల పార్టీ ప్రకటన!