అక్కినేని నవ సామ్రాట్ నాగచైతన్య .. బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా నటించబోతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ.. ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. నిజానికి ఆ పాత్ర ను విజయ్ సేతుపతి చేయాలి. అతడికి కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ స్థానంలోకి ఇప్పుడు నాగచైతన్య వచ్చాడు. ఈ సినిమా కోసం చైతూ ఏకంగా నెలరోజులు కాల్షీట్స్ ఇచ్చాడట.
తాజా సమాచారం ప్రకారం మే నెల నుంచి నాగచైతన్య షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఫారెస్ట్ గంఫ్ చిత్రానికి లాల్ సింగ్ చద్దా రీమేక్ వెర్షన్ . ఇందులో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెల్లో విడుదల కాబోతున్న లాల్ సింగ్ ఛద్దా సినిమా .. నాగచైతన్యకి బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరుచుకోవడానికి సరైన సినిమా అని భావిస్తున్నారు. ఈ మూవీతో అతడు పాన్ ఇండియా స్టార్ అయ్యే చాన్సెస్ ఉన్నయంటున్నారు. మరి బంగారం లాంటి అవకాశాన్ని చైతూ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Must Read ;- సూపర్ స్టార్ కటౌట్ తో అక్కినేని స్టార్