అక్కినేని నాగచైతన్య – సమంత అక్కినేని.. హైదరాబాద్ లో కొత్త కారులో డ్రైవ్ కి వెళ్తూ కెమెరా కంటపడ్డారు. చైతు – సామ్ కొత్త మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నట్టు తెలిసింది. వాళ్లిద్దరూ కొత్తగా కొనుకున్న కారులో అలా.. అలా.. షికారుకు వెళ్లారు. ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. చైతు – సామ్ నవ్వుతూ కనిపిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ మాయచేసావే సినిమాలో కలిసి నటించి.. ఆతర్వాత ప్రేమలో పడడం.. 2017లో అక్టోబర్ 6న పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఫిదా బ్యూటీ కథానాయిక. ఈ విభిన్న ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాగచైతన్య థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు.
ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువకుల రెండు కాదల్ అనే సినిమా చేస్తోంది. తెలుగు తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నయనతార కూడా నటిస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతల అనే హిస్టోరికల్ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారని సమాచారం.
Must Read ;- చై సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?