పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంల్ చోటుచేసుకున్న సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు టీడీపీ నేత చంద్రబాబు. కల్తీ సారా తాగి చనిపోతే వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.ఇటువంటి వ్యాఖ్యలు చేసిన జగన్ కు అసలు పరిపాలించే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు.ఈ ఘటనలో 26 మంది చనిపోతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని చంద్రబాబు మండిపడ్డారు.ఎన్నికల్లో మద్యపాన నిషేధమం చేస్తానంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో జగన్ తన సొంత బ్రాండ్ల అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.నాసిరకం బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచడం వల్లే పేదలు నాటుసారా తాగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులే నాటుసారా వ్యాపారం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడిందని ఆరోపించిన ఆయన కల్తీ సారా దొంగలను పట్టుకుని కేసులు పెట్టించేవరకు ఊరుకోనని హెచ్చరించారు. ఈ సంధర్భంగా బాధిత 26 కుటుంబాలకు చంద్రబాబు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఎల్.జి పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయలు పరిహారం ఇస్తామన్న జగన్ ,నాటుసారా మృతులకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తుందని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.అదేసమయంలో నాటుసారా బాధితులకు ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీతో సహ చెల్లిస్తానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో జగన్ వంటి నీచమైన, అబద్ధాల ముఖమంత్రిని చూడలేదని, ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు.
Must Read:-జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన